25 April, 2026 | 3:37 AM

వడ్డీ వ్యాపారులపై కొరడా

25-04-2026 12:15 AM

ఏకకాలంలో 45 బృందాలచే దాడులు

ఆదిలాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : రైతులు, అమాయక ప్రజల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడుస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా జలుపించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో 16 మండలాలలో 45 బృందాలచే దాదాపు వందమంది వడ్డీ వ్యాపారు లపై ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 7 మండలాలలో దాదాపు 15 కేసులు నమో దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.

వ్యవసాయ భూములు తాకట్టు పెట్టు కుని, వ్యవసాయ భూములు తమ పేర్లపై రాయించుకొని వడ్డీ నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారుల పై దాడులలో వడ్డీ వ్యాపారాల వద్ద నుండి ప్రామిసరీ నోట్లో, బాండ్లు, చెక్కు బుక్కులు, ఖాళీ పేపర్స్, స్టాంప్ పేపర్స్, సేల్ డేట్స్ లాంటివి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అక్రమార్కుల ఆటలు కట్టడి చేయ డం జరుగుతుంది అని, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా జిల్లా పోలీస్ యంత్రాం గం కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు.