23 August, 2026 | 1:36 AM

విధుల్లో పోలీసుల ప్రతిభ: సీపీ ప్రశంస

23-08-2026 12:37 AM

సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, సంక్లిష్టమైన కేసులను ఛేదించడంలో గడిచిన 6 నెలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు. శనివారం నిర్వహించిన 'రివార్డ్ మేళా' వేదికగా మొత్తం 90 మందికి ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ, అహర్నిశలు  ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న ప్రతీ ఒక్కరిని గుర్తించి ప్రోత్సహించడమే రివార్డ్ మేళా ముఖ్య ఉద్దేశమన్నారు. ఇదే ఉత్సాహంతో పని చేస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రజలకు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.