23 August, 2026 | 2:16 AM

తప్పుగా మాట్లాడలేదు

23-08-2026 01:34 AM
  1. కార్యకర్తల ఆవేదననే తెలియజేశా 
  2. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): నాలుగు దశాబ్దాలుగా  కాంగ్రెస్ జెండాను భుజాన మోస్తున్న కార్యకర్తల మనోభావాలు, ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశానని, ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని, పార్టీ కి నష్టం కలిగించే వారిని ప్రశ్నించడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదుతో కాంగ్రె స్ రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై శనివారం ఆయన కమిటీకి లేఖ రాశారు.

రెండున్నర ఏళ్లుగా కార్యకర్తలు, నాయకులు అను భవిస్తున్న బాధలను మాత్రమే తాను వెల్లడించానని చిన్నారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహారం ఒంటెద్దుపోకడలా ఉం దని.. నేతలు, కార్యకర్తలు పడుతున్న ఆవేదనను తెలియజేశానని స్పష్టం చేశారు.  తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, వాటిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరా రు. 1978 ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీలో సభ్యత్వం తీసుకుని ఈ నాటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నానని చిన్నారెడ్డి స్పష్టం చేశారు.

ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాం ధీ, మల్లికార్జునఖర్గే లాంటి వాళ్లు తనకు దేవుళ్ల తో సమానమన్నారు. అలాంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రసక్తే లేదన్నారు. ఈనెల 16న గోపాల్‌పేట మండల కాంగ్రెస్ పార్టీ కా ర్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తా ను మాట్లాడిన మాటలు గత రెండున్నరేళ్లు గా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అ నుభవిస్తున్న బాధల్లో భాగమేనన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించి తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.