గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
05-06-2026 04:53 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): గో మాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ మఠంపల్లి మండల కేంద్రంలో సనాతన ధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హుజూర్ నగర్ - మట్టపల్లి ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మఠంపల్లి మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంకట శివ మాట్లాడుతూ... హిందువులు ఆరాధించే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధ పై,బలి కోసం ఆవులను తరలించి చేసే అమ్మకాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని పేర్కొన్నారు.హిందూ సమాజానికి ఆవులు పవిత్రమైనవని, ప్రీతిపాత్రమైన గోవులను రాజ్యాంగ పరంగా రక్షించాలని ఆయన చెప్పారు.సంతలో క్రయ విక్రయాలు జరపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






