calender_icon.png 16 February, 2026 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదివింది వృక్షశాస్త్రం.. సేవకు రాజకీయ శాస్త్రం

16-02-2026 05:47:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్,  వైస్ చైర్మన్గా ఎన్నికైన దంపతులు ఉన్నత విద్య వంతులే. చైర్ పర్సన్ గా ఎన్నికైన అప్పాల కావ్య ఎమ్మెస్సీ వృక్ష శాస్త్రంలో పట్టా సాధించగా, వైస్ చైర్మన్ గా ఎన్నికైన అప్పాల గణేష్ చక్రవర్తి న్యాయ శాస్త్రంలో బిఏ ఎల్ఎల్బి పూర్తి చేశారు. ఇద్దరు ఉన్నత విద్యావంతులు కావడంతో రాజకీయ కుటుంబ నేపథ్యం. మున్సిపల్ పాలకవర్గంలో నాలుగు సార్లు ఆ కుటుంబానికి సంబంధించిన సభ్యులే అధ్యక్షులుగా పని చేయడంతో పూర్తి అవగాహన ఉంది.

ఎన్నికల సందర్భంగా వారు మాట్లాడుతూ... నిర్మల్ పట్టణంలో అవినీతి రహిత పాలన అందిస్తామని. కోతులను తరిమికొడతామని, పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన. ప్రతిరోజు మార్నింగ్ వాక్, ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఇది తమ విజయం కాదని ప్రజల విజయమని ప్రజల కోసం కష్టపడి పని చేస్తామని వారు ప్రజలకు భరోసా కల్పించారు. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ కు ఇద్దరు సంతానం. కుమారుడు శౌర్య చక్రవర్తి, కుమార్తె ఆద్య, ఈమెకు 40 సంవత్సరాలు.