విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు కూలింగ్!
24-05-2026 12:07 AM
మహబూబాబాద్, మే 23 (విజయక్రాంతి): ప్రచండ భానుడి ఉగ్రరూపానికి ఓరుగల్లు వణకిపోతోంది. దీంతో గత మూ డు..నాలుగు రోజుల నుంచి 45 డిగ్రీలకు తగ్గకుండా పగటి ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా ను నియంత్రించే ట్రాన్స్‌ఫార్మర్లు కూడా హీటెక్కుతున్నాయి. శనివారం హనుమకొండ బాల సముద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో వేడి తగ్గించేందుకు సిబ్బంది ట్రాన్స్‌ఫార్లకు గన్నీ సంచులను చుట్టి నీరు చల్లి ఎక్స్ట ర్నల్ కూలింగ్ అయ్యేలా చర్యలు చేపట్టారు. బయట ఉష్ణోగ్రత, ట్రాన్స్‌ఫార్మర్ లోపల ఉష్ణోగ్రత సమతుల్యత కాపాడకపోతే ట్రాన్స్‌ఫార్మర్ల మన్నిక దెబ్బతింటుందని, ఇందుకో సం బయట ఉష్ణోగ్రత తగ్గించడానికి ఇలా ప్రత్యామ్నాయ కూలింగ్ ఏర్పాట్లు చేసినట్లు విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు.






