3 May, 2026 | 1:48 AM

అక్రమ వసూళ్లపై గుత్తేదారుల దౌర్జన్యం

03-05-2026 12:32 AM

పెబ్బేరు సంతలో ఘటన

పెబ్బేరు, మే 2(విజయక్రాంతి): పెబ్బేరులో శనివారం నిర్వహించే సంతలో పశువులు, గొర్రెలు వినియోగదారులతో గుత్తేదారులు టాక్స్ రూపంలో నగదును అక్రమంగా వసూ ళ్లు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రుసుంకంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్రమ వసూళ్లను ప్రశ్నించిన మహిళలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, మాటలతో బెదిరిస్తున్నారు. ఈ సంతకు ప్రభుత్వం పరంగా టెండర్ లేకపోవడంతో  మున్సిపాలిటీ అధికారులు కానీ, పాలకవర్గం పట్టించుకోవడంలేదు. దీంతో గుత్తేదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు.