మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణాలు
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. మండలంలోని చద్మల్ తండాలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ఆదేశాలతో రూ.25 లక్షల వ్యయంతో ప్రారంభించిన సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి అయినట్టు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామంలో రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు , ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తప్పినట్టు వారు అన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బంతిలాల్, అమర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు జగదీష్, మాజీ ఎంపీటీసీ ప్రేమ్ సింగ్, గ్రామస్థులు పాల్గొన్నారు.




