15 July, 2026 | 12:45 AM

పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్2026లో జిల్లా పోలీసులకు పతకాల పంట

15-07-2026 12:45 AM

11 పథకాలతో ఆదర్శంగా నిలిచిన జిల్లా పోలీసులు

కొత్తగూడెం జులై 14 (విజయ క్రాంతి ): మల్కాజిగిరి కమిషనరేట్లో జూలై 7 నుంచి 9 వరకు నిర్వహించిన,5వ తెలంగాణ పోలీస్ స్పోరట్స్ & గేమ్స్2026లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సిబ్బంది,5 స్వర్ణ, 2 రజత, 4 కాంస్య పతకాలతో మొత్తం 11 పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని చాటారు. డబ్ల్యూపీసీ బి. రజని ఆర్మ్ రెజ్లింగ్లో స్వర్ణ పతకం, బాక్సింగ్, యోగా ఆర్టిస్టిక్ పెయిర్, యోగా రిథమిక్ పెయిర్ లలో 3 కాంస్య పతకాలు  సాధించారు.

డబ్ల్యూపీసీ బి. రత్న కుమారి వుషు,యోగా రిథమిక్ పెయిర్లలో 2 స్వర్ణ పతకాలు, యోగా ట్రెడిషనల్, జిమ్నాస్టిక్స్లో  2 రజత పతకాలు సాధించారు. డబ్ల్యూపీసీ డి. సుశ్మా బాయి పవర్ లిఫ్టింగ్లో స్వర్ణ పతకం, పీసీ వి. వంశీకృష్ణ పవర్ లిఫ్టింగ్లో స్వర్ణ పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విజేతలను అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.