అంబేద్కర్ యువజన నూతన కమిటీ ఎన్నిక
18-08-2026 01:30 AM
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 17 ( విజయక్రాంతి ): మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా కొంగరి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా నల్లోల శేఖర్, ప్రధాన కార్యదర్శి నర్కుడి రమేష్, కోశాధికారి నరాల రాజు, ప్రచార కమిటీ కార్యదర్శి నరాల అజయ్, ముఖ్య కార్యనిర్వాహన కార్యదర్శి బోసుపల్లి మోహన్, కార్యనిర్వాహన కార్యదర్శి బోసుపల్లి కిషోర్ లను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా కొంగరి ప్రశాంత్, నర్కుడు భాస్కర్, సలహారులుగా నరాల మల్లేష్, నల్లోల యాదయ్య, నరాల రఘు, కొంగరి నర్సింహా లను ప్రకటించడం జరిగింది.






