18 August, 2026 | 3:25 AM

ప్రజావాణికి విశేష స్పందన

18-08-2026 01:31 AM

ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో45 వినతుల స్వీకరణ

ఆమనగల్లు /కడ్తాల్/తలకొండపల్లి, ఆగస్టు17(విజయక్రాంతి) ఆమనగల్లు కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్య క్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు కార్యక్రమం కొనసాగగా రెండు మండలాల నుంచి భా రీగా దరఖాస్తు లాగా తలకొండపల్లి మండలంలో కేవలం రెండు మాత్రమే  మాడ్గుల మండలంలో 3 దరఖాస్తులు వచ్చాయి.

ఆ మనగల్.. తలకొండపల్లి, కడ్తల్, మాడ్గుల మండలాల్లో  ఎంపీడీఓ, తాసిల్దార్  వినతులు స్వీకరించారు.ఆమనగల్ మండ లం 27 వినతులు రాగా అందులో గృహ ని ర్మాణ శాఖ - 15,వ్యవసాయ శాఖ - 3, రె వెన్యూ శాఖ - 2,పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి - 2, మున్సిపల్ శాఖ - 2,విద్యుత్, బీసీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖలకు ఒక్కొక్కటి  చొప్పున  వినతులు వచ్చాయి.కడ్తాల్ మండలం 15 వినతులు రాగా అందులో రె వెన్యూ శాఖ - 13,విద్యాశాఖ - 2కు వచ్చాయి.