1 September, 2026 | 3:27 AM

కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ బోగస్

01-09-2026 02:04 AM
  1. వెయ్యి రోజుల పాలనలో ఘోర అన్యాయం
  2. 21 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు
  3. పాపన్న గౌడ్ స్పూర్తితో రాజ్యాధికారం సాధిస్తాం
  4. టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాం తి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సంద ర్భంగా బీసీలకు ఇచ్చిన హామీల అమలుపై ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ (MLC, Telangana Rajyaadhikari Party) వ్య వస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) సోమవారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించా రు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు 21 కీలక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పా ర్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు.

గతంలో బీఆర్‌ఎస్ బీసీలను మోసం చేసిందని, ప్రస్తు తం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని మల్లన్న పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు శాసనమండలి రికార్డులు, ప్రభుత్వ శాఖలు ఇచ్చిన అధి కారిక లిఖితపూర్వక సమాధానాలను ఆధారంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాలను ప్రజల ముందుకు తీ సుకువస్తున్నా- మన్నారు. స్థానిక సంస్థల్లో బీ సీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, కులగణన ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యా న్ని

పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేసిన మల్లన్న, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోగా ఇప్పటికే ఉన్న అవకాశాలను కూడా దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని విమర్శిం చారు. ఐదేళ్లలో బీసీల అభివృద్ధి కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులలో అత్యల్ప మొత్తమే ఖర్చు చేసినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయని మల్లన్న వెల్లడించారు.

విద్య, ఉపా ధి, కార్పొరేషన్లు, సంక్షేమ పథకాలు, వృత్తి ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల కోసం భారీగా కేటాయింపులు చూపించినా అమలులో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కనిపించింద న్నారు. వివిధ బీసీ కులాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 22 కార్పొరేషన్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాల కోసం వేల కోట్లు కేటాయించినప్పటికీ, వాటిలో అతి స్వ ల్ప మొత్తమే ఖర్చు చేసినట్లు ప్రభుత్వ సమాధానాలు స్పష్టం చేస్తున్నాయని మల్లన్న పేర్కొన్నారు.

బీసీ యువత స్వయం ఉపాధి, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక సాధికారత కోసం ఉద్దేశించిన పథకాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని అన్నారు. అధికారంలోకి వచ్చి న వెంటనే మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని, కానీ అనేక అసెంబ్లీ సమావేశాలు ముగిసినా ఇప్పటి వరకు ఆ అంశంపై ప్రభుత్వం ఎలాంటి చర్య లు తీసుకోలేదని మల్లన్న అన్నారు. వడ్డీ లేని రుణాలు, ప్రతి జిల్లాలో బీసీ ఐక్యతా భవనా లు, ప్రతి మండలంలో గురుకులాలు,

కొత్త డిగ్రీ కాలేజీలు, వృత్తి బజార్లు, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వృత్తిదారులకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు.ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ బకా యిలు పేరుకుపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిరుద్యోగ యువతకు స్వయం ఉ పాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.తెలంగాణ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీ సమాజానికి రాజకీయ అధికారం దక్కినప్పుడే నిజమైన సామాజిక,

ఆర్థిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏలిన చారిత్రాత్మక గోల్కొండ కోట నుంచి సెప్టెంబర్ 17న బీసీ రాజ్యాధికార పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మ ల్లన్న ప్రకటించారు.’సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గోల్కొండ కోట నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర బీసీ రాజ్యాధికార ఉద్యమానికి కొత్త దిశను చూపుతుంది’ అని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.