రావల్‌కోల్‌లో జీవాలకు పీపీఆర్ వ్యాక్సిన్
17-07-2026 12:00 AM
మేడ్చల్ అర్బన్ జూలై 16(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రావల్ కోల్ లో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గోర్లకు,మేకలకు పిపిఆర్ వ్యాక్సిన్ వేయడం జరిగిందని గొర్ల, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమురయ్య తెలిపారు. ఈ సందర్భంగా పశు వైధ్యాధికారి కురుమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గోర్లకు, మేకలకు పిపిఆర్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విఎల్‌ఒ శోభారాణి, శంకర్‌రె డ్డి. జె విఓలతో పాటు శ్రీనివాస్, తిరుపతి, ఓ ఎస్‌లు గొర్ల, మేకల పెంపకందారులు ర మేష్, మామిల్ల చంద్రయ్య, బొల్లబోయిన శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.






