4 March, 2026 | 2:21 AM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆటంకాల కటకట

04-03-2026 12:33 AM

ఒక్కో చోట ఒక్కో రకం ఇబ్బందులు 

లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారుల భరోసా 

స్థానికంగా మాత్రం అవస్థలు పడుతున్న ఇందిరమ్మ లబ్ధిదారులు 

కామారెడ్డి జిల్లాలో లబ్ధిదారుల అవస్థలు 

కామారెడ్డి, మార్చి 3 (విజయక్రాంతి): ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఎంతో మంది పేద ఇండ్లు లేని లబ్ధిదారులు సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు పేదలు ఎన్నో ప్రయా సాలకు గురై ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు.

ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి 

ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజలకు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని అధికారులు, జిల్లా కలెక్టర్ సైతం ప్రత్యేక చొరవ చూపుతున్నారు. పేదలకు బీస్ మెంట్ లెవెల్ నిర్మిస్తే లక్ష రూపాయల బిల్లు, గోడలు నిర్మాణం దొరికితే లక్ష రూపాయల బిల్లు, స్లాబ్ వేస్తే లక్ష రూపాయల బిల్లు ను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అంతేకాకుండా ఇంటి చుట్టూ ప్రహరీ తో పాటు మౌలిక వసతులు సమకూర్చుకోవాలంటే పూర్తిస్థాయి బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

లబ్ధిదారులకు ఆదిలోనే అవస్థలు 

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ఆదిలోనే ఇసుక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి తక్కువ రేటులో ఇసుక సరఫరా, ఇటుక, సలాక ఇప్పిస్తామని లబ్ధిదారులకు అధికారుల హామీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా లబ్ధిదారులకు తరపున చేస్తున్నామంటూ ఇసుక దందా నిర్వాహకులు స్థానిక రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఇసుక టోకెన్లు తీసుకొని ఒక టోకెన్ పై 10 ట్రిప్పుల వరకు ఇసుకను తరలించి బయటి మార్కెట్లో అమ్ముకుంటున్నారు. మరోవైపు బిల్లులు ఇచ్చేందుకు కూడా అధికారులు కోర్రి పెడుతున్నారు. నిబంధనల పేర లబ్ధిదారులకు ఇబ్బందులు పెడుతున్నారు.

దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులు అసలే డబ్బులు లేని ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బులతో ఇల్లు నిర్మించుకుందామని మరికొన్ని డబ్బులు చేసి సొంత ఇంటి కల నెరవేర్చుకుందాం అని భావిస్తున్న లబ్ధిదారులకు స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై లక్ష రూపాయల బిల్లుకు ఎంతో కొంత పర్సంటేజీలు తీసుకొని జేబులు నింపుకుంటున్నారు. మరికొన్ని చోట్ల లబ్ధిదారులు ప్రశ్నిస్తే వారికి బిల్లులు చెల్లించడంలో ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఒక్క అడుగు ముందుకు రెండు అడుగుల వెనక్కు అనే సామెత లాగా లబ్ధిదారుల పరిస్థితి నెలకొంది. 

సకాలంలో నిర్మించిన వారికి బిల్లులు 

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణం పనులు ప్రారంభించి త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తేనే బిల్లులు సకాలంలో అందుతాయని అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. డబ్బులు ఉన్న పరిస్థితుల్లో పనులు సాగిస్తున్నారు. మరి కొంతమంది గంప గుప్త గా అప్పజెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల తో పాటు మరో ఆరు లక్షలు కలిపి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వం మరో రెండు లక్షలు అదనంగా మంజూరు చేస్తే ఇందిరమ్మ లబ్ధిదారులకు అప్పుల భారం ఉండదని లబ్ధిదారులు వాపోతున్నారు. 

మెటీరియల్ పంపిణీ ఆలస్యం 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసే మెటీరియల్ సకాలంలో అందించక ఇబ్బందులు తప్పడం లేదు. ఇసుక, సిమెంటు, సలాక, ఇటుకల తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పిన అధికారులు చేతులెత్తేశారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఇల్లు నిర్మాణం జరగదని అప్పుచేసి ఇండ్లు నిర్మించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు.

అధికారులు సహకరించాల్సింది పోయి లబ్ధిదారులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. లబ్ధిదారుల అవసరాలను చూడకుండా సకాలంలో ఇల్లు పద్ధతి ప్రకారం నిర్మిస్తేనే బిల్లులు సకాలంలో వస్తాయని లేకుంటే బిల్లులు ఆగిపోతే తమకు బాధ్యత కాదంటూ అధికారులు లబ్ధిదారు లను హెచ్చరిస్తున్నారు. 

లబ్ధిదారులను ఇబ్బందులు గురి చేయొద్దు 

స్థానికంగా ఉన్న జిపిఓలు, గ్రామ కార్యదర్శులు, ఏఈలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు కోరుతున్నారు. లబ్ధిదారులకు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉండి ఇందిరమ్మ లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.

ఇండ్లకు ఆటంకాలు 

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలంటే నీ టి కటకట ఏర్పడుతుంది. గ్రామ పంచాయతీకి సంబంధించిన నీటిని వాడుకుందాం అంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సరే డబ్బులు లేక అప్పులు చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులకు స్థానిక అధికారు లు  కోర్రీలు పెట్టడంతో లబ్ధిదారులు సంస్థలు పడుతున్నారు. అప్పులు తెచ్చి ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇండ్ల నిర్మాణం చేపడితే ఐకెపి నుంచి రుణం ఇచ్చి ఆదుకుంటామన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు డబ్బులు లేని పేదలకు ఐకెపి గ్రూపులో నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో నుంచి, గ్రామ సంఘాల నుంచి రుణాలిపించి ఇండ్లు నిర్మించేందుకు అధికారులు ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే స్థానిక అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. 

అధికారులను నమ్మి పనులు ప్రారంభించారు 

ఇందిరమ్మ  ఇండ్ల నిర్మాణం కోసం అధికారులు రుణాలు ఇస్తామని నచ్చజెప్పడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులుతో ఇల్లు నిర్మాణం జరుగుతుందని భావించిన లబ్ధిదారులకు అధికారుల కొర్రీలు పెట్టడం వల్ల ఇందిరమ్మ ఇండ్లు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. త్వరగా నిర్మిస్తానే బిల్లులు అందుతాయని అధికారులు భయం చెప్తున్నారు. దీంతో అటు ఇందిరమ్మ ఇండ్లు  నిర్మాణం పూర్తి కాక అప్పులు చేసిన వాటికి వడ్డీలు ఎక్కువ అవుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ లేని రుణాలనిపించడంతోపాటు ప్రభుత్వం ఇచ్చే డబ్బులను త్వరగా ఇప్పిస్తే పనులు పూర్తిచేసుకుని సొంత ఇంటి వారివి అవుతామని లబ్ధిదారులు కోరుతున్నారు. 

ఉన్నతాధికారులు స్పందిస్తారా.. 

కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జిల్లాలోని ప్రతి మండలం పరిధిలోని గ్రామాలకు తోపాటు పట్టణాల్లో సైతం ఇండ్ల నిర్మాణాలు చేపడు తున్నారు. అధికారు లు పెడుతున్న కోరిల వల్ల ఇందిరామ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత అధికారులు క్షేత్రస్థాయిలో పరీక్షించి లబ్ధిదారుల ఇబ్బందులను గుర్తించి వారికి సహకరించాలని కోరుతున్నారు. జిల్లాలో 50 శాతం వరకు కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. అనడానికి అధికారులు పెడుతున్న అడ్డంకుల వల్లే పనులు ముందుకు సాగడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని కోరుతున్నారు. 

లబ్ధిదారులకు ఇబ్బందులు ఉంటే నేరుగా అధికారులకు చెప్పవచ్చు 

కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే జిల్లా కేంద్రంలోని అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. మండల కేంద్రంలోని అధికారులకు ఫిర్యాదు చేస్తే తమ దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు త లేకుండా చూస్తాం. ఎక్కడైనా ఇబ్బందులతో తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడతాం.

- పార్థసారథి రెడ్డి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రాజెక్ట్ అధికారి, కామారెడ్డి