ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయండి
06-06-2026 07:01 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అవిష్ మిశ్రా అన్నారు. శనివారం ధాన్యం కొనుగోళ్లపై అన్ని మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఆయా మండల కేంద్రంలో ఉన్న ధాన్యం నిలువలు సరఫరా గోన సంచుల కొడతా తదితర వివరాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున వర్షాలు కురిస్తే పంట తడిసిపోయి అవకాశం ఉందని ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు బైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.






