‘పరీక్షల’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
01-08-2026 12:55 AM
ఇక అధికారికంగా చట్టం
న్యూఢిల్లీ, జూలై ౩౧: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉభయసభల్లో పబ్లిక్ పరీక్షల నియంత్రణ (సవరణ) బిల్లు ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసన, గందరగోళం మధ్య ఈ బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు శుక్రవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం తెలిపారు. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. బిల్లు దీంతో చట్టంగా మారనుంది. ఇకపై ప్రశ్నాపత్రాలు లీక్ చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు, భారీ జరిమానా విధించేందుకు, న్యాయస్థానాలు శిక్ష విధించేందుకు మార్గం సుగమమైంది.






