24 March, 2026 | 1:10 PM

Breaking News

నిర్భయంగా ఫిర్యాదు చేయాలి: ఎస్పీ నితికా

24-03-2026 12:01 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 23(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను విని, చట్టప్రకారం త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మొత్తం 13 ఫిర్యాదులు స్వీకరించగా వాటి పరిష్కారానికి సంబంధిత డీఎస్పీ, ఏఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన మార్గనిర్దేశం చేశారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను స్వీకరించి పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.