5 August, 2026 | 1:42 AM

కౌన్సిలర్ భర్త పెత్తనంపై ఫిర్యాదు

05-08-2026 12:53 AM

మేడ్చల్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సోమరం వార్డ్ కౌన్సిలర్ రజిత భర్త రాజేందర్ పెత్తనం చెలాయిస్తున్నాడని, అన్నింటిలో జోక్యం చేసుకుంటున్నాడని అదే గ్రామానికి చెందిన కురకుల శ్యామ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

రాజేందర్ కు ఎలాంటి అధికారిక పదవిలేకున్నప్పటికీ కౌన్సిలర్ కుర్చీలో కూర్చుంటున్నాడని పేర్కొన్నారు. ప్రజా ప్రజా ప్రతినిధి కానీ వ్యక్తి అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటున్నాడని తెలిపారు. రాజేందర్ వ్యవహారం వల్ల మున్సిపల్ పాలనపై ప్రజలకు విశ్వాసం దెబ్బతింటుందన్నారు. అంతేగాక మహిళా కౌన్సిలర్ కుర్చీల కూర్చోవడం మహిళా అధికారాన్ని అవమానించడమేనన్నారు. అధికార దుర్వినియోగంపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.