సనత్‌నగర్ బోనాల ఉత్సవాలకు కోట
05-08-2026 12:53 AM
నీలిమకు ఆహ్వానం
సికింద్రాబాద్, ఆగస్టు 4 ,(విజయ క్రాంతి): సనత్ నగర్ లోని హనుమాన్ దేవస్థానంలో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమను ఆలయ ఈవో సత్యనారాయణ, ప్రధాన అర్చకులు, కాంగ్రెస్ పార్టీ బీకే గూడ, సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు రవికాంత్, అజ్జు, సీనియర్ నాయకులు ప్రమోద్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమను కలిసి బోనాల ఉత్సవాల ఏర్పాట్ల గురించి వివరించిన ఆలయ ప్రతినిధులు, సంప్రదాయబద్ధంగా జరిగే ఈ వేడుకలకు హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






