29 July, 2026 | 1:55 AM

ట్రిపుల్ రైడింగ్, కుటుంబ గొడవల కేసుల్లో ఐదుగురికి కమ్యూనిటీ సర్వీస్

29-07-2026 12:00 AM

ఉప్పల్, జూలై 28 (విజయక్రాంతి): నాచారం పోలీసుల చర్యలతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, కుటుంబ గొడవలకు సంబంధించిన కేసుల్లో ఐదుగురికి ఎల్బీ నగర్ కోర్టు రెండు రోజుల పాటు స్వచ్ఛ భారత్ కమ్యూనిటీ సర్వీస్ విధించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలాజీ నగర్కు చెందిన మహేష్ (19), బాలాపూర్కు చెందిన క్విసి (19), ఘట్కేసర్కు చెందిన సంకీర్త్ (19) ఒకే మోట్సాక్పి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడ్డారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని నాచారం పోలీసులు ఎల్బీ నగర్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఇద్దరు రోజుల పాటు స్వచ్ఛ భారత్ కమ్యూనిటీ సర్వీస్ నిర్వహించాలని ఆదేశించింది. అలాగే, మల్లాపూర్లోని జేఎన్‌ఎన్‌ఆర్‌ఎం కాలనీకి చెందిన ఎం.డి. రాజా అన్సారి (37), ఎన్టీఆర్ నగర్కు చెందిన పి. శ్రీను (40) కుటుంబ గొడవలకు సంబంధించిన కేసులో కోర్టు ముందు హాజరుకాగా, వారికి కూడా రెండు రోజుల పాటు కమ్యూనిటీ సర్వీస్ విధించింది.

కోర్టు ఆదేశాల మేరకు ఐదుగురు నిందితులు ప్రజా ప్రదేశాల పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని కమ్యూనిటీ సేవలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.