తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ వేసిన సీఎంకు మంత్రులకు కృతజ్ఞతలు
16-05-2026 02:18 PM
మంథని,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి తెలంగాణ ఉద్యమకారునిగా, విద్యార్థి నాయకునిగా బెజ్జంకి డిగంబర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్ గా నియమితులైన కేశవరావు కు మెంబర్స్ అయిన పొన్నం ప్రభాకర్ కి, కోదండరాం గారికి అద్దంకి దయాకర్ కి, ఎస్ రాములు నాయక్ కి మోతే శోభన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నమన్నారు.






