17 August, 2026 | 11:53 AM

మొదటి రోజే ఆలస్యంగా ప్రజావాణి

17-08-2026 10:42 AM

సమయపాలన పాటించని అధికారులు.. 

10 గంటలు దాటినా హాజరుకాని ఎంపీడీవో..

కారేపల్లి,ఆగస్టు17(విజయక్రాంతి): సింగరేణి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం తొలిరోజే సమయందాటిన ప్రారంభం కాలేదు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాల్సిన అధికారులు సమయపాలన పాటించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల సమయం దాటినా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) హాజరుకాకపోవడంతో ప్రజలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజావాణికి నిర్ణయించిన సమయానికి అధికారులు హాజరై ప్రజల సమస్యలను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.