కేదరీనాథ్ ఆలయంలో ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పూజలు
17-08-2026 11:31 AM
బోథ్, ఆగస్టు 17 ( విజయక్రాంతి): మండల కేంద్రంలోని కేదరీనాథ్ ఆలయంలో నాగ పంచమి పురస్కరించుకొని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సోమవారం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. నియోజకవర్గంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేపట్టిన ఆయన తెలిపారు. ఆనవెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు.






