బాలాపూర్‌లో దారుణం
ప్రేమికురాలి హత్య..
గోనె సంచిలో మృతదేహం తరలించేందుకు యత్నం!
బాలాపూర్, ఆగస్టు 17(విజయక్రాంతి): హైదరాబాద్ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్(Balapur Police Station) పరిధిలో తీవ్ర కలకలం రేపిన దారుణ హత్య వెలుగు చూసింది. బిస్మిల్లా కాలనీలో ఒక యువతి దారుణంగా హత్యకు గురైంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, సదరు యువతిని ఆమెను ప్రేమించిన యువకుడే అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. తాను ప్రేమించిన యువతి మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందన్న అనుమానం, క్రోధంతోనే ఈ హత్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం ఆ యువకుడు ఆధారాలు లభించకుండా ఉండేందుకు మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, అక్కడ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు.
పోలీసుల దర్యాప్తు....
సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు కూడా పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు వేగవంతం చేశారు.






