16 May, 2026 | 3:00 PM

కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షులు నియామకం ప్రక్రియ నిలిపివేత

16-05-2026 02:21 PM

బోథ్,(విజయక్రాంతి): ఇటీవల వివిధ మండలాలలో నూతనంగా నియమించబడిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ తెలిపారు. రాష్ట్రకి పిసిసి అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయమై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కార్యకర్తలు తొందరపడవద్దని కోరారు. ఈ విషయమై ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్ తో నిర్వహించిన  సమావేశంలో వివరించడం జరిగిందన్నారు