17 August, 2026 | 1:20 PM

వైద్య ఖర్చులకోసం నైనిష ఫౌండేషన్ ఆర్థిక సాయం

17-08-2026 11:27 AM

మణుగూరు, ఆగష్టు 17,(విజయక్రాంతి): మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన పిల్లల పుల్లమ్మ  అనారోగ్యంతో  చికిత్స పొందుతున్నారు. వైద్య చికిత్స చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న నైనిష ఫౌండేషన్ వెంటనే స్పందించి, పిల్లల పుల్లమ్మ కి రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నైనిష ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ సంస్థ అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఫౌండర్ మట్టపల్లి సాగర్ యాదవ్, జర్నలిస్ట్ పోదిల వీరబాబు, అడ్వకేట్ ఈర్ల రాము, జర్నలిస్ట్ మిట్టపల్లి గోపి,  ఎండి గౌస్ పాషా, బానోతు రమేష్ , బి నాగేష్ తదితరులు పాల్గొన్నారు...