17 August, 2026 | 12:42 PM

చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలి

17-08-2026 11:41 AM
  1. కామారెడ్డి లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా 
  2. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ 
  3. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ 
  4. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలి 
  5. పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలను వెంటనే కొనసాగించాలని డిమాండ్

కామారెడ్డి, ఆగస్టు 17(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే గద్దె దిగాలి కానీ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను ఎత్తివేసేందుకు కుట్రలు చేయవద్దని BRS నాయకులు సోమవారం కామారెడ్డి(Kamareddy) నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తా పై బైఠాయించి నినాదాలు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం తగదన్నారు. చేతకాక పోతే పెద్ద దిగాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను కొనసాగించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి, కౌన్సిలర్లు కుంభాల రవి యాదవ్, ఆరకల ప్రభాకర్ యాదవ్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, బలవంతరావు, మహిళా అధ్యక్షురాలు సుమిత్రానంద్, కామారెడ్డి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.