ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకూడదు
ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై పాలకవర్గం సభ్యులతో కమిషనర్ గంగాధర్ సమీక్ష
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్ పాలకవర్గ సభ్యులకు సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మ బేగం ఎజాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మిషన్ భగీరథ ద్వార తాగునీటిని సరఫరా చేయడం జరుగుచున్నది.
ఇట్టి నీటిని సింగూరు జలాల ద్వార సరఫరా చేయగా ప్రస్తుతం సింగూరు యందు నీటి మట్టం తగ్గడంతో నీరు సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ముందస్థుగా పట్టణ ప్రజలకు తాగునీటిపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నీటి సరఫరా చేయుటకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకొనుటకు పాలకవర్గ సభ్యులు అనుమతించాలని ఆయన కోరారు. పట్టణంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు పాలకవర్గం సభ్యులందరం సహకరిస్తామని తగు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మల్లికార్జున్ సిబ్బంది పాలకవర్గం సభ్యులు తదితరులు ఉన్నారు.






