7 July, 2026 | 9:57 PM

సమాజ వికాసానికి... నైపుణ్యాలకు విద్యయే ఏకైక మార్గం

07-07-2026 08:46 PM

సమాజంలో అసమానతలు... చదువుతూనే దూరం

ప్రభుత్వ పాఠశాల... సాధనా కమిటీ కన్వీనర్ తోటపల్లి శంకర్

జ్యోతిరావు పూలే భవన్... ప్రజావాణిలో వినతి పత్రం సమర్పణ

జవహర్ నగర్,(విజయక్రాంతి): సమాజ వికాసానికి నైపుణ్యాలకు విద్యయే ఏకైక మార్గమని, గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాలను వెంటనే నిర్మించాలని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లోని ప్రజావాణిలో చిన్నారెడ్డికి మంగళవారం గబ్బిలాల పేట ప్రభుత్వ పాఠశాల పోరాట కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో అసమానతలు చదువుతూనే దూరం అవుతాయని గబ్బిలాల పేట ప్రాంతంలోని పేద పిల్లలకు చదువు అందకపోవడం దారుణమని ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయించి పాఠశాల నిర్మాణం చేయాలని పాఠశాల సాధనా కమిటీ కన్వీనర్ తోటపల్లి శంకర్ డిమాండ్ చేశారు.

గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం పాఠశాల సాధనా కమిటీ కన్వీనర్ తోటపల్లి శంకర్ ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీసులో చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పాఠశాల నిర్మించాలని ఇప్పటికే 6000 మందితో సంతకాల సేకరణ మానవహారం వంటి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. గబ్బిలాల పేటలో పిల్లలకు ఆధార్ కార్డు జనన ధ్రువీకరణ పత్రాలు లేవని ప్రభుత్వం చొరవ తీసుకొని చర్యలు చేపట్టాలని తెలిపారు. స్పందించిన చిన్నారెడ్డి త్వరలోనే పాఠశాల స్థలం కేటాయించి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

సమాజంలో ఉన్న పేదరికం అనారోగ్యం అసమానతలు వంటి ఎన్నో సమస్యల పరిష్కారానికి విద్య బలమైన పునాది అన్నారు. పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇక్కడ తక్షణమే ప్రభుత్వ పాఠశాలను నిర్మించాలని జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ ఏ. నరసింహ గౌడ్, షేక్షావలి, కొండలు ముదిరాజ్, స్వామి, శివ బాబు, సుబ్రహ్మణ్యం, శ్యామ్, జయసుధ, మంజుల, రాధేశ్యాం, సూర వెంకటయ్య, దుర్గేష్, సునీల్, జి. సాయిలు, లక్ష్మీబాయి, ఆర్. సుధాకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.