గోపతండలో ఘనంగా సీత్లా భవాని పండుగ వేడుకలు
మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని గోపతండ గ్రామంలో మంగళవారం సీత్ల భవాని పండుగను గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ప్రకృతిని ఆరాధించే ఈ సంప్రదాయ పండుగను "దాటుడు" అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం పెద్ద పూసల కార్తిలో వచ్చే మంగళవారం రోజున ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ అని గిరిజనులు చెబుతున్నారు. అనంతరం గోపతండ గ్రామ సర్పంచ్ భూక్య బిక్కు మాట్లాడుతూ... పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ సీత్ల భవాని పండుగను నిర్వహిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా తుల్జా భవానీ, మేరమ్మ భవాని, సీత్ల భవానిలను ప్రత్యేకంగా పూజిస్తారు.ఈ వేడుకల్లో తండా పెద్దలు, మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయ ఆచారాలను పాటిస్తారు. పండుగ సందర్భంగా తండాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాలోతు ఈశ్వరి రవి, డీలర్ సీతారాములు, బి.నరేష్, బి. నాగు,జి. వినోద్,జి. భగవాన్, బి నవీన్, వార్డ్ మెంబర్లు, జి. అమ్మి (కిట్టు), కే.నరేష్, కే.లక్పతి, జి.రాములు, జి. అశ్విని రామోజీ, పెరుగు లలిత రమేష్, మాలోతు ఈశ్వరి రవి,జి. బాసు, మాజీ ఎంపిటిసి శ్రీరాములు, గ్రామ పెద్దలు గ్రామ యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






