29 June, 2026 | 1:06 AM

రైతు ఆశీర్వాద సభకు తరలిరండి

29-06-2026 12:11 AM

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు  మంత్రి తుమ్మల పిలుపు

ఖమ్మం, జూన్ 28(విజయక్రాంతి): రైతులే దేశానికి వెన్నెముక అని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ప్రకటించారు. ఈనెల 30వ తేదీన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం వద్ద జరుగుతున్న ‘రైతు ఆశీర్వాద సభ’ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చారిత్రాత్మకమైనదని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రైతు ఆశీర్వాద సభ,

అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు చూడటానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి మరియు ఆధునిక వ్యవసాయ విధానాలను వారికి పరిచయం చేయడానికి ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది అన్నారు.ఈ చారిత్రాత్మక సభకు అన్ని మండలాలలోని రైతులు, ప్రజలు, మరియు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.