11 April, 2026 | 5:51 PM

Breaking News

సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే   •   అక్షరాయుధంతో అణచివేతపై పోరాడిన ధీశాలి పూలే   •   జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం   •   తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేత   •   CAA అమలు వేగవంతం— చొరబాటుదారులు సామాన్లు సర్దుకోవాల్సిందే! మోదీ హెచ్చరిక   •   విద్యా విప్లవానికి నాంది..   •   సామాజిక సమస్యలపై కార్మిక వర్గం పోరాడాలి   •   యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి   •   సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం   •   ఇరాన్‌ కండిషన్స్‌కు ఒప్పుకున్న అమెరికా   •  

హౌస్ లిస్టింగ్ బ్లాక్‌ల జనగణన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి

11-04-2026 04:16 PM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

సుల్తానాబాద్,(విజయక్రాంతి): హౌస్ లిస్టింగ్ బ్లాక్‌ల జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  సుల్తానాబాద్ పురపాలక సంఘం లో జరుగుతున్న జనగణన  ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.

పట్టణంలోని ల్యాండ్‌ మార్క్‌లు, పాఠశాలలు, దేవాలయాలు,  కార్యాలయాలు తదితర గుర్తులను బ్లాక్ వారీగా స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్‌కు సంబంధించిన వివరాలు ఖచ్చితమైన సమాచారంతో సిద్ధం చేసి సమర్పించాలనిఅధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి డిప్యూటీ తహసిల్దార్ విజయ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.