స్వయంభూ శంభు లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రముఖులు
07-07-2026 12:03 AM
మేళ్లచెరువు, జులై 6: స్థానిక శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లా జడ్జి శ్రీమతి లక్ష్మీ శారద, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సాముల రామిరెడ్డి, తదితరులు శంభు లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి నాగేళ్ల శంబిరెడ్డి, అర్చకులు,పూర్ణకుంభము తో ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ పెండ్లి లచ్చయ్య, సభ్యులు అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ, కొంకపాక ధనుంజయ శర్మ పాల్గొన్నారు.






