ఫీజు బకాయిలు విడుదల చేయాలని... ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన ఐక్య విద్యార్థి సంఘాలు
మంచిర్యాల టౌన్, జూలై 6 : జిల్లాలో ఐ దేండ్లుగా పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాల (టీవీయూవీ, టీవీఎస్, ఎన్‌ఎస్సీ) ఆధ్వర్యంలో సోమ వారం రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశా రు.
ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థు ల సంక్షేమం కోసం పాటుపడతామని ఎన్నికల్లో హామీలు కురిపించి ఇప్పుడు విద్యార్థు లను పట్టించుకోవడం లేదని, ఐదేండ్లుగా విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 8 వేల కోట్లకు పైగా ఉన్నాయని, ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యా సంవత్సరంలో పాసైన విద్యా ర్థులు తమ సర్టిఫికెట్ల కోసం ప్రైవేటు కళాశాలల చుట్టూ తిరుగుతూ నానా తిప్పలు పడు తున్నారని, యాజమాన్యాలు మాత్రం ఫీజు లు చెల్లించనిదే సర్టిఫికేట్స్ ఇచ్చేది లేదని, మీరు దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ వి ద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నాయన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యా ర్థుల ఫీజు బకాయిల విషయంలో సానుకూలతతో స్పందించి నిధులు విడుదల చేయా లని ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు రేగుంట క్రాం తి కుమార్ (టీవీఎస్), బచ్చలి అభిరామ్ (ఎన్‌ఎస్సీ), విద్యార్థులు కిరణ్, అనిల్, స్వామి, జంగు తదితరులు పాల్గొన్నారు.






