11 April, 2026 | 6:12 PM

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే

11-04-2026 04:12 PM

ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి (విజయ క్రాంతి): బడుగు బలహీన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి, మహిళలకు విద్యాబోధన కల్పించిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలేనని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మహాత్మా జ్యోతి రావు పూలే 199వ జయంతి సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

సమాజంలోని అసమానతలు తొలగించి, మహిళలకు ప్రత్యేకంగా విద్యా ఆవశ్యకతను తెలిపిన మహోన్నత మూర్తి అని కొనియాడారు. నేడు పేద ప్రజల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ పార్టీ అలుపెరగని కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలంతా సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి రావాలని కోరారు. దేశ ప్రజలంతా జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయా సాధనలో పాలుపంచుకోవాలని కోరారు.