ఆలయాలకు పూర్వవైభవం
11-04-2026 04:19 PM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆలయాలకు పూర్వ వైభవం వచ్చినట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో పోచమ్మ తల్లి నూతన ఆలయ ప్రతిష్టాపన అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడారు.
ప్రభుత్వం ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి ఆలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మీపతి గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, సర్పంచులు ఏనుగుల కనకయ్య, మోహన్ , అశోక్ తదితరులు పాల్గొన్నారు.




