9 July, 2026 | 1:23 AM

యాప్ ద్వారా యూరియా విక్రయాన్ని పరిశీలించిన కలెక్టర్

09-07-2026 12:20 AM

మేడ్చల్, జులై 8 (విజయ క్రాంతి):   శామీర్ పేట్ లోని  ఎరువు ల దుకాణంలో యాప్ ద్వారా యూరియా విక్రయాలను కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి పరిశీలించారు.  కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ యాప్ యొక్క పని తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆన్ లైన్ ద్వారా ఏవింధంగా ఎరువులు బుక్ చేసుకోవాలనే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి రైతు కూడా ఈ యొక్క యాప్ ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలని అన్నారు.

ప్రతి రైతు కూడా ఎరువుల కోసం తప్పనిసరి ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లో ఈ యాప్ ద్వారా 3598 ఎరువుల బుకింగ్ జరిగాయని అందుకు గాను 753 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులు పొందారని వివరించారు. ఈ కార్యక్రమం లో మేడ్చల్ జిల్లా వ్యవసాయ అధికారి  చంద్రకళ, మండల వ్యవసాయ అధికారి రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనాథ్, మండలం లోని ఎరువుల డీలర్స్,  రైతులు పాల్గొన్నారు.