భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించిన బోయపల్లి
బడంగ్‌పేట్, విజయక్రాంతి జూలై 8: జిహెచ్‌ఎంసి బడంగ్ పేట్ సర్కిల్ నాదర్ గుల్ 57వ డివిజన్ అల్మాస్గూడలోని వినాయక హిల్స్ ఫేజ్2, రోడ్డు నెం.18 & 19లలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ.. స్థానిక ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్మాణ పనులను త్వరత్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనను అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల అమలకు నిరంతరం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సభ్యులు పాల్గొన్నారు.






