9 July, 2026 | 1:22 AM

ఎన్యూమరేషన్ ఫారాల భర్తీకి బీఆర్‌ఎస్ హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

09-07-2026 12:19 AM

ముషీరాబాద్‌లో ఎస్‌ఐఆర్ 70 శాతం పూర్తి: ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ దరఖాస్తులు నింపడంలో ఓటర్లు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని గుర్తించి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు.

ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దీన్ దయాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా మాట్లాడుతూ  ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్‌ఎస్ పార్టీ నేతలు బీఎల్ వోకు సంపూర్ణ సహకారం అందిస్తూ ఎస్‌ఐఆర్ విజయం వంతం చేసేందుకు కృషిచేస్తున్నారని తెలిపారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన ఓటర్లను గుర్తించి ఎన్యూమరేషన్ ఫారాలను అందించడం వల్ల ఇప్పటివరకు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ 70శాతం పూర్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని 274 పోలింగ్ బూత్ లలో ఎస్‌ఐఆర్ ను వందశాతం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్  దరఖాస్తులను స్వీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను దీన్ దయాల్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు డి. శివ ముదిరాజ్, టి. సోమన్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు టెంట్ హౌస్ శ్రీనివాస్, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సదా, నియోజకవర్గం బీఆర్‌ఎస్ మీడియా సెల్ ఇన్చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, డివిజన్ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రావణి, నాయకులు జాఫర్, బల్వంత్ పాల్గొన్నారు.