26 August, 2026 | 2:40 AM

అభివృద్ధికి పార్టీలకతీతంగా సమష్టి కృషి

26-08-2026 12:00 AM

ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్‌నగర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకతీతంగా సమన్వయంతో పనిచేస్తామని ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు.

మెట్టుగడ్డలో రూ.8.26 కోట్ల సమగ్ర శిక్షా అభియాన్ నిధులతో ఆధునికీకరించిన డైట్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. కంప్యూటర్, సైన్స్, డిజిటల్ ల్యాబ్లు, ఆధునిక తరగతి గదులు, సెమినార్ హాల్, లైబ్రరీ తదితర సదుపాయాలతో కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దినట్లు ఎమ్మెల్యే తెలిపారు. హన్వాడ మండలంలో రూ.3.97 కోట్ల పి ఎంజీఎస్త్వ్ర నిధులతో నిర్మించిన హన్వాడగుడిమల్కాపూర్ బీటీ రోడ్డును ప్రారంభించారు.

కోడూరుకోయిల్కొండ రహదారికి రూ.22 కోట్ల CRIT నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఓబ్లాయిపల్లిలో రూ.30 లక్షలతో ఫుడ్ స్టోరేజ్ గోదాం, పోతన్పల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.12 లక్షల అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. పద్మావతి కాలనీలో బీపీ మండల్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సామాజిక న్యాయం, బీసీల అభ్యున్నతికి మండల్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం స్టేట్ హోంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఇదిలా ఉండగా, మాజీ రాజ్యసభ సభ్యుడు మధు సతీమణి పి.సుమతి మృతికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సంతాపం తెలిపారు. సుశ్రుత ఆసుపత్రిలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హన్వాడ మండలం లింగన్నపల్లికి చెందిన పకీర్ ఆంజనేయులుకు వైద్య చికిత్స కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2.50 లక్షల ఎల్వోసీ ని ఎమ్మెల్యే అందజేశారు.