26 August, 2026 | 1:29 AM

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితంగా బ్యాగులు, షూస్ పంపిణీ

25-08-2026 11:47 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ విద్యాశాఖ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, షూస్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కళాశాల ప్రిన్సిపాల్ నల్ల రామచంద్రారెడ్డి  ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.​ రాష్ట్రంలో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారమును తగ్గించేందుకు ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ఉచితంగా అందజేస్తోంది.

​ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నల్ల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలను వివరిస్తూ ​పేద, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లోనూ అన్ని మెరుగైన వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.​ తల్లిదండ్రులపై భారం పడకుండా విద్యార్థుల చదువుకు కావలసిన సామగ్రిని అందించడం ద్వారా వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గుతుందని, ఈ సదవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకొని ఎదగాలని కోరారు. విద్యార్థులకు బ్యాగులు​బ్రాండెడ్ షూస్ మరియు సాక్సులు​ఉచిత నోట్ పుస్తకాలు అందజేశారు.​ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.