14 August, 2026 | 2:18 AM

సంగారెడ్డిలో నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం

14-08-2026 01:00 AM

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 

సంగారెడ్డి, ఆగస్టు 13: ఈనెల 15న సంగారెడ్డి పట్టణానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ గార్ల విగ్రహాలను ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించ నున్నారు. గురువారం  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిలు విగ్రహాలు నెలకొల్పిన స్థలాన్ని అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు.

సీఎం చేతులమీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ఏర్పాట్లను అధికారులకు సూచించారు. విగ్రహ ఆవిష్కరణ సమయంలో సీఎంతో పాటు ఎవరెవరు పాల్గొంటారో అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ జూలకంటి అంజనేయులు, సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి, నాయకులు రఘు గౌడ్,జార్జ్, కూన సంతోష్,కిరణ్ గౌడ్, మహేష్, శ్రీకాంత్, ప్రవీణ్ , సందీప్ రెడ్డి, మొగులయ్య, ఖలీల్ తదితరులున్నారు.