14 August, 2026 | 2:16 AM

డేటా సెంటర్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ శిక్షణ

14-08-2026 01:00 AM
  1. రెండో బ్యాచ్‌కు 40 మంది విద్యార్థుల ఎంపిక
  2. స్కిల్స్ వర్సిటీలో ప్రారంభం

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : యువతకు డేటా సెంటర్ రంగంలో పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యా లను అందించేందుకు రూపొందించిన డేటా సెంటర్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రెండో బ్యాచ్ గురువారం హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూని వర్సిటీలో ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్ మద్దతుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని యు నైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అమలు చేస్తుండగా.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సి టీ అక్రిడిటేషన్ అందిస్తోంది.

హైదరాబాద్‌లోని ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఉన్న యూనివర్సిటీ ట్రాన్సిట్ క్యాంపస్‌లో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. రెండో బ్యాచ్‌లో 40 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.  మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందిన వారిలో 80 శాతం మంది ఉద్యోగాలు పొం దారు.

ఇదే స్ఫూర్తితో రెండో బ్యాచ్ యువతను డేటా సెంటర్ రంగానికి సిద్ధం చేయాల ని లక్ష్యంగా పెట్టుకున్నారు.  స్కి ల్స్ వర్సిటీ వీసీ వీఎల్వీఎస్‌ఎస్ సుబ్బారావు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కమ్యూనిటీ అఫై ర్స్ డైరెక్టర్ టియాంజీ డికెన్స్, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సీఈవో రేఖా శ్రీనివాసన్, స్ట్రాటజీ అండ్ ఇంపాక్ట్ లీడ్ భరత్ మెరుగు తదితరులు పాల్గొన్నారు.