బీవీఆర్‌ఐటీలో జాతీయ హ్యాకథాన్
నర్సాపూర్, ఆగస్టు 13: బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ)లో సీఎస్బీఎస్ విభాగం ఆధ్వర్యంలో 24 గంటల జాతీయ స్థాయి ‘డిమక్స్3.0’ హ్యాకథాన్ గురువారం ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 139 బృందాలు పోటీలో పాల్గొంటున్నాయి.
టీసీఎస్ హైదరాబాద్ ప్రతినిధి మురళి ముసునూరి మాట్లాడుతూ సమస్యను అర్థం చేసుకుని సమర్థవంతమైన సాంకేతిక పరిష్కారం రూపొందించడమే విజయానికి కీలకమన్నారు. ఏఐ సాధనాలను ఉపయోగించేటప్పుడు వాటి సాంకేతికతను అర్థం చేసుకోవాలని సూచించారు.
ప్రిన్సిపల్ డాక్టర్ సంజాయ్ ధూబే విద్యార్థులు హ్యాకథాన్లను సద్వినియోగం చేసుకుని సాంకేతిక, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. హ్యాకథాన్ లో ఏఐ, సుస్థిర అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయ సాంకేతికత, ఐఓటీస్వయంచాలక యం త్రాలు, నూతన ఆవిష్కరణలు అనే ఆరు అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, మేనేజర్ బాపిరాజు, ఏవో సురేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






