13 May, 2026 | 10:31 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

నేడు సీఎం రేవంత్‌రెడ్డి రాక

17-01-2026 03:06 AM

రాష్ట్ర యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి

మహబూబ్ నగర్, జనవరి 16 (విజయక్రాంతి): అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పాలమూరు ముద్దుబిడ్డ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అని రాష్ట్ర యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.    ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  పాల్గొనే సభా ప్రాంగణ ఏర్పాట్లను  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి,  రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్  ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తో కలిసి పర్యవేక్షించారు.

ఈ మట్టి బిడ్డ కు మన సీఎం రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలుకుదామని ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో 1284.44 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలిపారు.  ఈ చారిత్రక కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అపూర్వ స్వాగతం పలకాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, బెక్కెరి మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు శాంతన్న యాదవ్, ఫయాజ్, తాహెర్, బాలస్వామి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.