ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రజా పాలన - రైతు ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో పర్యటించారు. అనంతరం నంగనూరు మండలం నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించి, 62 ఎకరాలపైగా విస్తీర్ణంలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ కార్మాగారాన్ని రైతులకు అంకితమిచ్చారు. అలాగే నర్మెటలో రూ.80 కోట్లతో నిర్మించే వంటనూనె రిఫైనరీ ప్లాంట్ నిర్మాణానికి, ఇతర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా రైతుభరోసా కింద 70 లక్షల మంది రైతుల ఖాతాలకు తొలి విడతగా రూ.3,600 కోట్ల నిధులను విడుదల చేశారు. ఇవాళ ఆదివారం బ్యాంకులకు సెలవు కావండంతో రైతుల ఖాతాల్లో రేపు రైతుభరోసా డబ్బులు జమకానున్నాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మిగతా నిధులు రెండు విడతల్లో ప్రభుత్వం విడుదల చేయనుంది.




