17 August, 2026 | 1:12 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం

17-08-2026 12:29 AM

జుక్కల్, ఆగస్టు 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం కందర్పల్లి వద్ద ఏర్పాటుచేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కూతురి వివాహ విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను  ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మదన్మోహన్, షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ లతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. 

బీఆర్‌ఎస్, బీజేపీ నేతల అరెస్టులు: 

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పార్టీలకు అతీతంగా టిఆర్‌ఎస్ బిజెపి నాయకులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చి ముందస్తుగా ఆదివారం ఉదయం వారికి అరెస్టు చేశారని ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ హాజరు కావాలని ఈనెల 14న బిచ్కుందలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శుభకార్యానికి అని పిలిచి రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. సీఎంను అడ్డుకుంటామని ఎలా అనుకున్నారని అన్నారు. జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, డోంగ్లి తదితర మండలాలకు చెందిన నాయకులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.