17 August, 2026 | 3:07 AM

ఏవీ హోమ్స్‌లో ఘనంగా బోనాల పండుగ

17-08-2026 01:04 AM

మేడ్చల్, ఆగస్టు 16 (విజయ క్రాంతి): పోచారంలోని ఏవి వినూత్న హోమ్స్ లో బోనాల పండుగ తొలిసారి నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో మహంకాళి అమ్మవారి దేవాలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి పూజలు చేశారు.

సం దర్భంగా పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఏవి వినూత్న హోమ్స్‌లో మొదటిసారి నిర్వహిస్తున్న బో నాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమన్నారు. తెలంగాణ సం స్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఇ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.