కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాకారం
ఎలుకగూడలో ౩ లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు
మొయినాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొలిగిద్ద సత్యనారాయణ అన్నారు. మండల పరిధిలోని ఎలుకగూడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆలూరి అమృత, ఆలూరి శ్రీలత, రఫత్ బేగం నూతనంగా నిర్మించుకున్న ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన, మాజీ అధ్యక్షుడు తమ్మలి మానెయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ఇళ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి పేదల పక్షపాతి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాడి వెంకట్రెడ్డి, చిలుకూరు రాజు, విట్టల్, బిక్షపతి, ఆంజనేయులు గౌడ్, గోపాల్రెడ్డి, ఎం.డి. మినాజుద్దీన్, దామల్లపల్లి విజయ్, గుడిపల్లి ప్రభాకర్, తోలుకట్టే యాదయ్య, ఎం.డి. సాదిక్, అల్తాఫ్, హుస్సేన్, ఎం.డి. మీరాజ్, సయ్యద్ మసూద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






