విద్యుత్ ప్రమాదంతో సెంటరింగ్ కార్మికుడి మృతి
శేరిలింగంపల్లి,ఆగస్టు 16 (విజయక్రాంతి): కేశవరం నగర్, గౌలిదొడ్డి: నిర్మాణ రంగంలో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతో మరో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం మధ్యాహ్నం సుమారు 4 గం టలకు పి. శ్రీనివాస్ నిర్మాణ స్థలంలో రాడ్ బెండింగ్ పనులు జరుగుతుండగా జరిగిన ఘటనలో సెంటరింగ్ కార్మికుడు పంపటి సంగయ్య (59) అక్కడికక్కడే మరణించాడు.ఆ సమయంలో పని చేస్తున్న ఇనుప రాడ్ ప్రమాదవశాత్తు విద్యుత్ వ్పు పడటంతో రాడ్ ద్వారా విద్యుత్ ప్రవహించింది.
తీవ్ర షాక్కు గురైన సంగయ్య అక్కడికక్కడే ప్రాణలు విడిచాడు.సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.మృతుడి కుమారుడు పంపటి వెంకటేష్ (37) ఫిర్యాదు చేయగా, నిర్మాణ స్థల యజమానులు, బాధ్యులపై కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.నిర్మాణ స్థలాల్లో విద్యుత్ వైర్లు సమీపంలో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, భద్రతా పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. కార్మికుల భద్రతపై సంబంధిత అధికారులు, యజమానులు మరింత జాగ్రత్త వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






